ఆధునిక సాగు పద్ధతులతో అధిక దిగుబడి

2852చూసినవారు
ఆధునిక సాగు పద్ధతులతో అధిక దిగుబడి
ఆదిలాబాద్ జిల్లాలోని మావల రైతు వేదికలో గురువారం రైతులకు పత్తి విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి పాల్గొని, ఆధునిక సాగు పద్ధతులైన అధిక సాంద్రత పద్ధతిని అనుసరించడం ద్వారా తక్కువ విస్తీర్ణంలోనే ఎక్కువ దిగుబడి సాధించవచ్చని రైతులకు వివరించారు. ఈ పద్ధతుల వల్ల పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకుని, అధిక లాభాలు పొందవచ్చని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్