పిల్లలు పుట్టడం లేదని ఉరేసుకుని ఆత్మహత్య

1244చూసినవారు
పిల్లలు పుట్టడం లేదని ఉరేసుకుని ఆత్మహత్య
ఇచ్చోడ మండలం అడేగాం (కె)కు చెందిన సాగర్, ఆదిలాబాద్ (రూ) మండలం అంకోలికి చెందిన వెంకటమ్మతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. అత్తగారింటి వద్ద నివసిస్తున్న సాగర్, సంతానం కలగకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై మంగళవారం అంకోలి శివారులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై విష్ణువర్ధన్ వివరాలు సేకరించారు.

సంబంధిత పోస్ట్