ఆసిఫాబాద్ - Asifabad

శివాజీ విగ్రహ ఆవిష్కరణకు డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్కకు ఆహ్వానం

శివాజీ విగ్రహ ఆవిష్కరణకు డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్కకు ఆహ్వానం

ఆసిఫాబాద్ మండలం బెల్గం గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ, జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 19న నిర్వహించనున్న కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్కను ఆరే సంక్షేమ సంఘం ప్రతినిధులు ఆహ్వానించారు. మంగళవారం ఆమెకు ఆహ్వాన పత్రికను అందజేశారు. దేశ చరిత్రలో శివాజీ మహారాజ్ సేవలు చిరస్మరణీయమని, యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశభక్తి, ధైర్యసాహసాలతో ముందుకు సాగాలని సుగుణక్క సూచించారు. సమాజంలో ఐక్యత, దేశభక్తి పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆరే సంక్షేమ సంఘం ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వీడియోలు


కొమరంభీం జిల్లా