ఆసిఫాబాద్ : ముగ్గురు అధికారుల తాత్కాలిక తొలగింపు: DRDO

5చూసినవారు
ఆసిఫాబాద్ : ముగ్గురు అధికారుల తాత్కాలిక తొలగింపు: DRDO
కెరమెరి(M) కేస్లాగూడలో ఉపాధి హామీ పథకం పనుల్లో నిర్లక్ష్యం బయటపడింది. పర్కులేషన్ ట్యాంక్ నిర్మాణంలో కూలీలు హాజరు కాకపోయినా హాజరైనట్లు నమోదు చేసినట్లు ఫిర్యాదు రావడంతో విచారణ చేపట్టారు. అసిస్టెంట్ విజిలెన్స్ అధికారుల నివేదిక ఆధారంగా మండల అదనపు ప్రోగ్రాం అధికారి మల్లయ్యతో పాటు సాంకేతిక సహాయకులు అక్యా నాయక్, ఆడే అరవింద్‌లను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించినట్లు DRDO దత్తారావు తెలిపారు.

సంబంధిత పోస్ట్