సిర్పూర్-టిలో 11 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

628చూసినవారు
సిర్పూర్-టిలో 11 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
కొమరంభీం జిల్లా, ఆసిఫాబాద్‌లోని సిర్పూర్-టి రైల్వే స్టేషన్‌లో శనివారం అధికారులు 11 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ రహీముద్దీన్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ రాజ్‌కుమార్, జూనియర్ అసిస్టెంట్లు కమలాకర్, సాయి, సిర్పూర్ పోలీసులు సంయుక్తంగా ఈ తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు జరుగుతున్నాయని గ్రహించిన నిందితులు బియ్యాన్ని అక్కడే వదిలి పారిపోయారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని అధికారులు సీజ్ చేసి, పరారైన వారిని గుర్తించేందుకు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్