కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం జనవరి 02 నుంచి జనవరి 31 వరకు 30 పోలీస్ యాక్ట్–1861 అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ నితిక పంత్ ఐపీఎస్ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించడం నిషేధమన్నారు. నిషేధిత ఆయుధాలు కలిగి ఉండడం, ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించే సమావేశాలు పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతులతోనే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.