
ప్రేమ జంట ఆత్మహత్య.. ఒకే చోట ఖననం
AP: వైఎస్సార్ కడప జిల్లా చెన్నూరు గ్రామంలో యోగేంద్రకుమార్వర్మ, హేమశ్రీ అనే ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉన్న వీరు, ప్రేమలో పడ్డారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని భావించినా, చిన్నపాటి వివాదం వారిని మనస్తాపానికి గురిచేసింది. ప్రియుడి ఆత్మహత్యతో తట్టుకోలేక ప్రియురాలు కూడా బలవన్మరణానికి పాల్పడింది. బ్రతికి ఉన్నప్పుడు కలవలేకపోయినా, మరణంలోనైనా విడదీయకూడదని భావించిన కుటుంబసభ్యులు, వారిద్దరినీ ఒకే చోట ఖననం చేశారు.




