పదవీ విరమణ పొందిన రమాదేవికి ఘన సన్మానం

1122చూసినవారు
పదవీ విరమణ పొందిన రమాదేవికి ఘన సన్మానం
గిరిజన సంక్షేమ శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా సేవలందించి, జాయింట్ డైరెక్టర్‌గా పదవీ విరమణ పొందిన రమాదేవికి మంగళవారం హైదరాబాద్‌లోని సంక్షేమ భవన్‌లో ఘన సన్మానం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సంఘం (TSTWTU) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రవీందర్ శాలువా, బొకే, కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఆమె చేపట్టిన కార్యక్రమాల ఫొటోలతో రూపొందించిన జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా రాథోడ్ రవీందర్ మాట్లాడుతూ, గిరిజన విద్యాభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో రమాదేవి విశేష సేవలందించారని అన్నారు.
W

సంబంధిత పోస్ట్