కొమురం భీం జిల్లా పోలీస్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ అన్నారావు పదవీ విరమణ సందర్భంగా ఘన సన్మానం జరిగింది. జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆయనను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. 2003లో స్వీపర్‌గా సేవలు ప్రారంభించి, రికార్డు అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసి సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందిన అన్నారావు కృషిని ఎస్పీ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చిత్తరంజన్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయశంకర్ రెడ్డి, ఏవో భక్త ప్రహ్లాద్, సిబ్బంది పాల్గొన్నారు.