
ఈ ఆలయంలో అత్తాకోడలు కలిస్తే యుగాంతమే.. ఆ గుడి ఎక్కడ ఉందో తెలుసా?
కర్ణాటకలోని హాసన్ నగరంలో ఉన్న హాసనాంబ ఆలయం ఏడాదికి కేవలం ఏడు రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది. దీపావళికి ఆరు రోజుల ముందు తెరిచి, దీపావళి మరుసటి రోజు మూసివేస్తారు. ఇక్కడ అమ్మవారికి నివేదించిన అన్నప్రసాదం ఏడాది తర్వాత కూడా వేడిగా, రుచి మారకుండా ఉంటుందని, వెలిగించిన దీపం ఏడాది పొడవునా వెలుగుతూనే ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. అమ్మవారి అత్తగారు రాయిగా మారారని, ఆ రాయి ప్రతి సంవత్సరం బియ్యపుగింజంత కదులుతుందని, ఈ అత్తాకోడళ్ల రాళ్లు కలిస్తే యుగాంతం వస్తుందని చరిత్ర చెబుతోంది. ఇలాంటి మరెన్నో ఆలయ విశేషాలను ప్రతి రోజూ సాయంత్రం 5 గంటలకు #Hidden Secrets of Telugu Temples ద్వారా తెలుసుకోండి.




