ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి: రాథోడ్ రమేష

7చూసినవారు
ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి: రాథోడ్ రమేష
కాగజ్‌నగర్‌లో ప్రజా లైఫ్ కేర్ ఆసుపత్రిలో వైద్య నిర్లక్ష్యం కారణంగా పసికందు మృతి చెందిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ తీవ్రంగా స్పందించారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సీతారామును కలిసి వినతిపత్రం అందజేసిన ఆయన, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవల నాణ్యత, రోగుల భద్రతపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్