ఆసిఫాబాద్: పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి: ఏఐటీయూసీ డిమాండ్

64చూసినవారు
ఆసిఫాబాద్: పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి: ఏఐటీయూసీ డిమాండ్
రెబ్బెన మండలం గోలేటి సీహెచ్పీలో పని‌చేసిన లోడర్ ఆపరేటర్స్ కు పెండింగులో ఉన్న 2నెలల వేతనాలు, సీఎంపీఎఫ్ పూర్తి వివరాలు తెలియజేయాలని ఏఐటీయూసీ రీజియన్ అధ్యక్షుడు భోగే ఉపేందర్ సింగరేణి యాజమాన్యాన్ని కోరారు. శనివారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సీహెచ్పీ ఎస్ఈ కోటయ్యకు వినతిపత్రం ఇచ్చారు. వారు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించని యెడల ఆందోళన కార్యక్రమాలు చేస్తామని అన్నారు. లోడర్ ఆపరేటర్స్ నారాయణ, రాజు తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్