
2011 వరల్డ్ కప్ విన్నింగ్.. సచిన్ స్పెషల్ వీడియో
టీంఇండియా 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆనాటి మధుర జ్ఞాపకాలను ట్విట్టర్ లో గుర్తు చేసుకున్నారు. ఆ టోర్నీలో 482 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన సచిన్, 2011 ప్రపంచ కప్ విజయాన్ని తన జీవితంలోనే అత్యంత అందమైన క్షణమని పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక విజయం సాధించిన రోజున నాటి వీడియోను అభిమానులతో పంచుకున్నారు.




