బంబారా గ్రామంలోని ఎస్సీ కాలనీ వాసులు బుధవారం ఉదయం తమ కాలనీలో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సైడ్రెన్ నిర్మాణం, అంతర్గత రహదారులు, వీధిదీపాలు, తాగునీటి సరఫరా వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించడంలో విఫలమైనారని మాజీ సర్పంచ్‌ను నిలదీశారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజలు ఆందోళనకు దిగారు. ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు తమ వద్దకు వస్తారని, సమస్యలు చెప్పుకున్నా పట్టించుకోరని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.