ఆసిఫాబాద్: పత్తి విత్తనాల లారీ బోల్తా

0చూసినవారు
ఆసిఫాబాద్: పత్తి విత్తనాల లారీ బోల్తా
ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన ఓ లారీ యజమాని తన లారీలో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ జిన్నింగ్ మిల్లులో పత్తి విత్తనాలను తీసుకొని శుక్రవారం ఉదయం ఆదిలాబాద్ వైపునకు వెళ్తున్నాడు. కెరమెరి ఘాట్లోని చివరి మూల మలుపు వద్ద గుంతలో పడి లారీ బోల్తా పడింది. వాహన చోదకుడు చాకచక్యంతో వ్యవహరించి ప్రాణాలను దక్కించుకున్నాడు. ఈ ఘటనతో శుక్రవారం సాయంత్రం వరకు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.