ఆసిఫాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ నిర్వహించిన జూనియర్ ఎంపికల్లో జిల్లా జట్టుగా ఎంపికైన బాలురు, సోమవారం ఎమ్మెల్యే కోవ లక్ష్మిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా ఖ్యాతిని పెంచాలని ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ కమిటీ సభ్యులు ధర్మారావు, లింగారావు, చంద్రశేఖర్, సోమేశ్, దేవ్రా పాల్గొన్నారు.