తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే కొద్ది రోజులు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో రేపు ఉదయం 8.30 గంటలలోపు వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామని పేర్కొంది. భారీ ఈదురుగాలులు కూడా వీస్తాయని, మిగతా జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది.