సైబర్ జాగృత దివస్‌ సందర్భంగా లింగాపూర్‌లో అవగాహన కార్యక్రమం

2చూసినవారు
సైబర్ జాగృత దివస్‌ సందర్భంగా కొమురం భీం జిల్లా ఎస్పీ నితిక పంత్ ఆదేశాల మేరకు బుధవారం లింగాపూర్ మండలం అల్లిగూడ ఎక్స్‌రోడ్ వద్ద లింగాపూర్ ఎస్‌ఐ గంగన్న ఆధ్వర్యంలో సైబర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ కాల్స్, ఓటీపీ మోసాలు వంటి సైబర్ నేరాలపై జాగ్రత్తలు వివరించారు. అపరిచిత లింకులు క్లిక్ చేయకూడదని, వ్యక్తిగత వివరాలు ఎవరికీ పంచుకోవద్దని సూచిస్తూ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ట్యాగ్స్ :