నిషేధిత నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం: ముగ్గురిపై కేసు నమోదు

591చూసినవారు
కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా, రెబ్బెన మండలం కొమురవెల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం నిషేధించిన 175 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.4,37,500. వ్యవసాయ శాఖ అధికారి డి. దిలీప్‌కుమార్ ఫిర్యాదు మేరకు రెబ్బెన సీఐ సంజయ్ నేతృత్వంలో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. కొమురవెల్లికి చెందిన గజ్జెల సూర్యకాంత్, జక్కులపల్లికి చెందిన ధోని రాజేష్, కొమురవెల్లికి చెందిన కొల్లూరి సాయికిరణ్ అనే ముగ్గురు వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ నుండి నిషేధిత విత్తనాలను తెచ్చి, అధిక దిగుబడి వస్తుందని రైతులను మోసం చేస్తూ విక్రయిస్తున్నట్లు తెలిసింది. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపుతారని సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్