
కృత్రిమ మేధస్సులో ఒక చారిత్రక సంవత్సరం 2025
కృత్రిమ మేధస్సు (AI) ప్రయాణంలో 2025 సంవత్సరం ఒక చరిత్రాత్మక మలుపుగా నిలిచింది. గత ఏడాది వరకు శక్తివంతమైన టెక్నాలజీగా మాత్రమే కనిపించిన ఏఐ, ఇప్పుడు మన దైనందిన జీవితం, ఉద్యోగాలు, ఆర్థిక వ్యవస్థలో విడదీయరాని భాగంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలు కొత్త మోడల్స్‌తో ఏఐ సామర్థ్యాలకు కొత్త అర్థం చెప్పాయి. అదే సమయంలో, ఈ సాంకేతిక విప్లవం తెచ్చే ప్రమాదాలపై కూడా ప్రపంచం సీరియస్‌గా ఆలోచించడం మొదలుపెట్టింది.




