ఆసిఫాబాద్: 'భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండండి'

79చూసినవారు
ఆసిఫాబాద్: 'భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండండి'
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని గురువారం మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా బెజ్జూరు, పెంచికల్ పేట్, దహేగాం మండలాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.

సంబంధిత పోస్ట్