సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. ఎస్పీ నితికా పంత్

0చూసినవారు
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. ఎస్పీ నితికా పంత్
కొమరంభీం జిల్లా, ఆసిఫాబాద్, సిర్పూర్ పట్టణంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సైబర్ జాగృత దివాస్–సురక్షకా తిరంగా' కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ నితికా పంత్ ప్రజలకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించారు. సులభంగా డబ్బు సంపాదిస్తామనే ఆశతో పెట్టుబడి మోసాలకు గురికావద్దని, అపరిచితులు పంపే లింకులు, APK ఫైళ్లను తెరవద్దని, ఓటీపీలు, బ్యాంకు వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని లేదా పోలీసులను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, సైబర్ క్రైమ్ సిబ్బంది, విద్యార్థులు, ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్