బూరుగూడలో భరోసా టీం అవగాహన కార్యక్రమం

0చూసినవారు
బూరుగూడలో భరోసా టీం అవగాహన కార్యక్రమం
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని బూరుగూడ మండలంలో టీజీటిడబ్ల్యూఆర్‌డీసీ (గర్ల్స్) కళాశాలలో భరోసా కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు, పిల్లల భద్రత, లింగ సమానత్వం, సైబర్ నేరాలు, బాల్య వివాహాల నివారణ, పోక్సో చట్టం వంటి అంశాలపై విద్యార్థినులకు వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో 100, 112, 1098 నంబర్లను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భరోసా సిబ్బంది, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్