కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ప్రజా పాలన ప్రణాళికలో భాగంగా, ఆసిఫాబాద్ పట్టణంలోని మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ కార్యాలయాలు, లైబ్రరీలో భరోసా బృందం అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. ఎస్ఐ దివ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, భరోసా కేంద్రం సేవలు, పోక్సో చట్టం, లింగ సమానత్వం, సైబర్ నేరాలు, బాల్య వివాహాల నిరోధం వంటి అంశాలపై ప్రజలకు వివరించారు. అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు 100, 112, 1098, 181 వినియోగంపై కూడా సూచనలు అందించారు.