రైతుల సమస్యలు పరిశీలించిన బీజేపీ నాయకులు

2చూసినవారు
రెబ్బెన మండలంలోని కొమరవెల్లి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ నాయకులు సందర్శించి, అకాల వర్షాలతో ధాన్యం తడిసి నష్టపోతున్నామని, కొనుగోలు ప్రక్రియలో జాప్యం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు కేసరి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ, తాలు పేరుతో వడ్ల తూకంలో కోతలు విధించి రైతులను నష్టపరుస్తున్నారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, రైతులు తీసుకొచ్చిన ప్రతి గింజను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.