ఆసిఫాబాద్‌లో బీజేపీ నూతన జిల్లా కార్యాలయం ప్రారంభం

2చూసినవారు
ఆసిఫాబాద్‌లో బీజేపీ నూతన జిల్లా కార్యాలయం ప్రారంభం
తెలంగాణలో 9 జిల్లాల్లో నూతన బీజేపీ కార్యాలయాల ప్రారంభోత్సవంలో భాగంగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మించిన భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయాన్ని జాతీయ నాయకుడు నితిన్ నబి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ జిల్లా అధ్యక్షుడు డా. కొత్తపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, భారతదేశాన్ని విశ్వగురువు స్థానంలో నిలపడమే బీజేపీ లక్ష్యమని, కార్యకర్తల కృషి వల్లే పార్టీ ఈ స్థాయికి చేరుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అరిగేలా నాగేశ్వరరావు, వీరభద్రచారి, రాష్ట్ర నాయకులు కొట్నాక విజయ్, షేర్ల మురళి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్