ఆసిఫాబాద్‌లో బీఆర్‌ఎస్ భారీ ర్యాలీ

2చూసినవారు
ఆసిఫాబాద్‌లో బీఆర్‌ఎస్ భారీ ర్యాలీ
ఫోన్ టాపింగ్ ఆరోపణల నేపథ్యంలో కేసీఆర్‌ను విచారణకు పిలవడాన్ని కక్షసాధింపు చర్యగా అభివర్ణిస్తూ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, జిల్లా మున్సిపల్ ఇంచార్జి ఎంఎల్‌సీ దాసోజు శ్రవణ్ కుమార్ నేతృత్వంలో బీఆర్‌ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. నల్ల జెండాలతో రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్‌కు పంపిన ఎస్ఐటీ నోటీసులు బూటకమని పేర్కొంటూ వాటి కాపీలను రోడ్డుపై దహనం చేశారు. అనంతరం బీఆర్‌ఎస్ కార్యాలయంలో నల్ల జెండా ఆవిష్కరించి నిరసన తెలిపారు. తెలంగాణ సాధకుడిపై జరుగుతున్న కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్తామని ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్