మారుగూడలో గంజాయి మొక్కల స్వాధీనం.. రైతు అరెస్ట్

సిర్పూర్-యు మండలం మారుగూడ గ్రామంలో కోవా అర్జున్ అనే రైతు తన వ్యవసాయ భూమిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో, సిర్పూర్ (యు) సబ్ ఇన్‌స్పెక్టర్ డి. రామకృష్ణ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం పోలీసులు దాడులు నిర్వహించారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో దాడి చేసి, సుమారు 2 నుంచి 3 అడుగుల ఎత్తు ఉన్న 8 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.80,000 ఉంటుందని అంచనా వేశారు. నిందితుడు కోవా అర్జున్‌ను అదుపులోకి తీసుకుని, ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
