కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలంలో 15 ఏళ్ల బాలుడు ముగ్గురు బాలికలపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన సోమవారం వెలుగులోకి రాగా, మంగళవారం పోలీసులు గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. బాలుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు.