కేంద్ర లేబర్ కోడ్‌లు కార్మికుల హక్కులకు విఘాతం: ఏఐటియుసి

599చూసినవారు
కేంద్ర లేబర్ కోడ్‌లు కార్మికుల హక్కులకు విఘాతం: ఏఐటియుసి
కుమురంభీం జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో మే డే సందర్భంగా ఏఐటియుసి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో, జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు కార్మికుల హక్కులకు విఘాతం కలిగిస్తున్నాయని విమర్శించారు. ఈ కోడ్‌ల వల్ల ఉద్యోగ భద్రత తగ్గి, సమ్మె హక్కు పరిమితమై, పని గంటలు పెరిగే అవకాశం ఉందని, కార్మిక సంఘాలతో చర్చించకుండా చట్టాలు తీసుకురావడం సరికాదని అన్నారు. ఈ కోడ్‌లను ఉపసంహరించకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్