బుద్ధ విహార్‌లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి

1చూసినవారు
బుద్ధ విహార్‌లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి
వాంకిడి మండలంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అగ్రగామిగా నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ అని తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు కిర్మీళ్ల వినోద్, భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అశోక్ అన్నారు. శనివారం జేత్వాన్ బుద్ధ విహార్‌లో ఐలమ్మ 131వ జయంతి వేడుకలు నిర్వహించారు. భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం ఆమె చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. మహిళా శక్తికి, బహుజన చైతన్యానికి ఐలమ్మ ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కిషన్, దుర్గం దుర్గాజీ, దుర్గం శ్యామ్‌రావు, లహూజీ శ్యామ్‌రావు, పాండుజీ జాడే, అరుణ్, నాగ్‌సేన్, దిలీప్, వివేక్, వెంకటి, బుద్ధాజీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్