కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ బస్టాండ్ ఆవరణలో గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం సిర్పూర్ శాసనసభ్యుడు డా. పాల్వాయి హరీష్ బాబు 'క్లీన్ అండ్ గ్రీన్' కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ సిబ్బంది,
బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మరుగుదొడ్లను శుభ్రం చేసి, ఆవరణలోని చెత్తను తొలగించి, చెట్లు నాటారు. గాంధీజీ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే, స్వచ్ఛ
భారత్ పథకం కింద మహిళల ఆత్మగౌరవానికి ప్రాధాన్యతనిచ్చారని గుర్తుచేశారు.