కొమరంభీం జిల్లా, ఆసిఫాబాద్, సిర్పూర్ లోని డబ్బా బారేగూడ గ్రామానికి చెందిన బోర్లే వెంకటేశ్‌కు
కాంగ్రెస్ నాయకులు సీఎం సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కును శుక్రవారం అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన ఈ సహాయాన్ని ఎమ్మెల్సీ దండే విఠల్ ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు డుబ్బుల నానయ్య, ఉపాధ్యక్షుడు అంగోలా చిలకయ్య, పార్టీ నాయకులు అందించారు. పేదల సంక్షేమం కోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని వారు భరోసా ఇచ్చారు. అనంతరం అదే గ్రామంలో ఇటీవల మృతి చెందిన నీకోడే పెంటుబాయ్ కుటుంబాన్ని పరామర్శించారు.