సదరం-యూడీఐడీ శిబిరాలపై అధికారులకు కమిషనర్ దివ్య దేవరాజన్ ఆదేశాలు

568చూసినవారు
సదరం-యూడీఐడీ శిబిరాలపై అధికారులకు కమిషనర్ దివ్య దేవరాజన్ ఆదేశాలు
పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ శనివారం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి, సదరం-యూడీఐడీ శిబిరాలను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి నెలా ప్రత్యేక శిబిరాలు నిర్వహించి, పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలని, అర్హులకు మాత్రమే ధృవపత్రాలు జారీ చేయాలని స్పష్టం చేశారు. వినికిడి లోపం ఉన్న దివ్యాంగుల కోసం బేరా పరికరాల అంచనా వ్యయ వివరాలు సమర్పించాలని, మీసేవ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించాలని సూచించారు. కొమరంభీం జిల్లా, ఆసిఫాబాద్, సిర్పూర్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

సంబంధిత పోస్ట్