శీర్ష గ్రామంలో మద్యం అమ్మకాలు, సేవపై పూర్తి నిషేధం

818చూసినవారు
శీర్ష గ్రామంలో మద్యం అమ్మకాలు, సేవపై పూర్తి నిషేధం
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం శీర్ష గ్రామ పంచాయతీలో గ్రామస్థులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సర్పంచ్ మల్లేష్ ఆధ్వర్యంలో జరిగిన గ్రామ సమావేశంలో మద్యం అమ్మకాలు, సేవను పూర్తిగా నిషేధించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయించినా లేదా సేవించినా రూ.10,000 జరిమానా విధించనున్నట్లు స్పష్టం చేశారు. గ్రామ శాంతి, కుటుంబాల సంక్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్