రెబ్బెనలో రేవంత్‌రెడ్డి పాదయాత్రకు కాంగ్రెస్ నేతల సంఘీభావం

10చూసినవారు
రెబ్బెనలో రేవంత్‌రెడ్డి పాదయాత్రకు కాంగ్రెస్ నేతల సంఘీభావం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బంబర గ్రామపంచాయతీ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ యువకులు చేపట్టిన పాదయాత్రకు రెబ్బెనలో సంఘీభావం లభించింది. శనివారం రెబ్బెన మండలం ప్రారంభం వద్ద పాదయాత్రికులకు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వనమాల మురళి, మాజీ ఉపసర్పంచ్ మడ్డి శ్రీనివాస్‌గౌడ్, వార్డు సభ్యుడు పారశురాం స్వాగతం పలికి, పాదయాత్ర విజయవంతంగా కొనసాగాలని అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్