కొమరంభీం జిల్లా, సిర్పూర్, ఆసిఫాబాద్ పట్టణంలోని 15వ వార్డులో శనివారం ఎస్‌ఐఆర్ ప్రక్రియపై
కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క అవగాహన సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కౌన్సిలర్ అబ్దుల్లాతో కలిసి జరిగిన ఈ సమావేశంలో అర్హుల ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా ప్రతి
కాంగ్రెస్ కార్యకర్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, బూత్ సూపర్వైజర్లు, మండల అధ్యక్షులు, బీఎల్‌ఏ-2లు, పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిరక్షరాస్యులు, పేదలు, గ్రామీణ ప్రజలకు ఎస్‌ఐఆర్‌పై అవగాహన కల్పించి వారి ఓటు హక్కు కాపాడాలని స్పష్టం చేశారు.