ఆసిఫాబాద్ పట్టణంలోని దస్నాపూర్‌లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలను డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పరామర్శించారు. కాలిపోయిన ఇళ్లను పరిశీలించి, బాధితుల పరిస్థితిని తెలుసుకుని ఆర్థిక సహాయం అందించారు. అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు
కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు కృషి చేస్తామని, ప్రభుత్వ సహాయం త్వరగా అందేలా అధికారులతో మాట్లాడతామని హామీ ఇచ్చారు. కష్టకాలంలో ప్రజల వెంటే
కాంగ్రెస్ పార్టీ ఉంటుందని భరోసా ఇచ్చారు.