వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీపీఎం డిమాండ్

3చూసినవారు
వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీపీఎం డిమాండ్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మెంథ తుపాన్ కారణంగా కురిసిన అకాల వర్షాలతో పత్తి, వరి పంటలు తీవ్రంగా నష్టపోయాయని, నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని సీపీఎం పార్టీ డిమాండ్ చేసింది. శుక్రవారం ఆసిఫాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ మాట్లాడుతూ, అధికారులు ఇంకా పంట నష్టాన్ని అంచనా వేయలేదని విమర్శించారు. ప్రతి ఎకరానికి రూ. 15 వేల పరిహారం ఇవ్వాలని, లింగాపూర్ మండలంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్