కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క తిర్యాని మండలం దంతనపల్లిలోని ఆదివాసీ కొలాం సమాజం ఆరాధ్య దైవమైన భీమయ్యక్ దేవస్థానాన్ని దర్శించుకున్నారు. పలువురు ఆదివాసీ సంఘం నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుగుణక్క ఆదివాసీ, కొలాం సమాజం సాంప్రదాయాలు, ఆచారాలు గొప్పవని, వారి అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, స్థానిక ప్రజల సమస్యల పరిష్కారానికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పెందూర్ సుధాకర్, ఆత్రం భీమ్రావు, టేకం గంగారం, లింగు తదితరులు పాల్గొన్నారు.