హైదరాబాద్ లో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా గ్రామ కమిటీ అధ్యక్షుల బహిరంగ సభకు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా నుండి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివెళ్ళారు. సభ విజయవంతానికి సహకరించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు డీసీసీ జిల్లా అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు శనివారం ధన్యవాదాలు తెలిపారు. సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల నుండి 950 మంది సభకు వెళ్లి విజవంతం చేసినట్లు తెలిపారు.