ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డులు, ఇతర సిబ్బందికి కనీస వేతనం రూ. 26,000 చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. బుధవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్‌కు వినతిపత్రం అందజేశారు. ముఖ్యమంత్రి ప్రకటించిన కనీస వేతనాలను ఈ సిబ్బందికి కూడా వర్తింపజేయాలని, ప్రతినెలా 1వ తేదీన జీతాలు చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని, ఈపీఎఫ్, ఈఎస్‌ఐ వివరాలను పూర్తిగా తెలియజేయాలని కోరారు.