78 ఏళ్ల స్వాతంత్ర్యానికీ గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల కరువు

0చూసినవారు
78 ఏళ్ల స్వాతంత్ర్యానికీ గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల కరువు
ఆసిఫాబాద్ జిల్లా కేరామెరి మండలంలోని చిన్నుగూడ, అనార్‌పల్లి, లక్మాపూర్ గ్రామాల్లో లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ చౌహాన్ పర్యటించి గిరిజనుల సమస్యలను పరిశీలించారు. స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు గడిచినా గిరిజన గ్రామాల్లో కనీస మౌలిక వసతులు లేకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు, పక్కా ఇళ్లు, రోడ్లు, వంతెనలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వర్షాకాలంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభిస్తోందని, గర్భిణులు, విద్యార్థులు, రోగులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కొలాం తెగ అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్