ఇళ్లలో పనిచేసే సిబ్బంది వివరాలు పోలీస్ స్టేషన్‌లో తప్పనిసరి

11చూసినవారు
ఇళ్లలో పనిచేసే సిబ్బంది వివరాలు పోలీస్ స్టేషన్‌లో తప్పనిసరి
కుంరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఇంటి యజమానులు తమ ఇళ్లలో పనిచేసే వంట మనుషులు, సహాయకులు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు వంటి వారి పూర్తి వివరాలను సమీప పోలీస్ స్టేషన్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా ఎస్పీ నితికా పంత్ బుధవారం సూచించారు. ఆధార్ వివరాలు, నివాస చిరునామా, ఫోటో, మొబైల్ నెంబర్ నమోదు చేయడం ద్వారా భద్రతాపరమైన ప్రమాదాలను నివారించవచ్చని, అనుమానాస్పద ఘటనలు తలెత్తకుండా సురక్షిత వాతావరణం ఏర్పడుతుందని, ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని ఆమె తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్