కొమరంభీం జిల్లా, ఆసిఫాబాద్ మండలంలోని చిలుకూరి గ్రామంలో సీసీ రోడ్లు, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల కల్పన వంటి అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని గ్రామ ప్రజాప్రతినిధులు సోమవారం తెలిపారు. ప్రజల సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, భవిష్యత్తులో మరిన్ని పనులు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిలుకూరి కళ్యాణి సతీష్, ఉపసర్పంచ్ మరిశెట్టి ప్రేమ్‌సాగర్, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.