వంతెన శిథిలావస్థ: ప్రజల ప్రాణాలకు ముప్పు

4చూసినవారు
వంతెన శిథిలావస్థ: ప్రజల ప్రాణాలకు ముప్పు
కొమరంభీం జిల్లా, సిర్పూర్ టీ మండలంలోని పారిగాం గ్రామ సమీపంలో ఉన్న వంతెన శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. సుమారు 20 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ వంతెనకు అధికారులు కనీస మరమ్మతులు కూడా చేపట్టలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వంతెనపై ఏర్పడిన పగుళ్లు, గుంతల వల్ల వాహనదారులు, పాదచారులు భయాందోళనల మధ్య రాకపోకలు సాగిస్తున్నారు. ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. ఇది అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.

సంబంధిత పోస్ట్