అగర్వాడలో 100 హెల్మెట్ల పంపిణీ – ఎస్పీ నితిక పంత్

617చూసినవారు
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండలం అగర్వాడలో "పోలీసులు మీకోసం–అరైవ్ అలైవ్" కార్యక్రమంలో భాగంగా 100 హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ నితిక పంత్ ఐపీఎస్, ప్రతి ద్విచక్ర వాహనదారుడు, వెనుక కూర్చునే వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించి, బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ, ఎస్సై మధుకర్, సర్పంచ్ రోజా సోనాజీ, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్