రెబ్బన మండలం ఇందిరానగర్ గ్రామంలో, ఉపాధి హామీ పనులకు వెళ్లేవారు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, మండల కేంద్రానికి వచ్చేవారు, ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి ఇందిరానగర్ శ్రీ కనక దుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళీ దేవస్థాన అర్చకులు దేవార వినోద్ స్వామి ఆధ్వర్యంలో ప్రతిరోజూ అంబలి పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వేసవి కాలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ప్రజలకు ఉపశమనం కలిగిస్తోంది.