కన్నెపల్లి గ్రామంలోని ఎంపియుపిఎస్, యుపిఎస్ పాఠశాలల విద్యార్థులకు గ్రామ సర్పంచ్ మోర్లె పార్వతి ఆధ్వర్యంలో సోమవారం ఉచిత చూచిరాత పుస్తకాలు పంపిణీ చేశారు.
విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని, విద్యాభివృద్ధికి గ్రామ పంచాయతీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సర్పంచ్ తెలిపారు. విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు అందించడం ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు.