ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీలు

0చూసినవారు
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్, ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కెరమెరి మండలంలోని కొటారి కొత్తగూడ హెలిప్యాడ్, ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమ స్థలాలను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లను సమీక్షించి, పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమ ప్రాంగణంలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో వాంకిడి సీఐ వేణుగోపాల్, కెరమెరి ఎస్‌ఐ మధుకర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్